కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు అన్ని తీవ్ర సమస్యలే
కస్తూర్బా పాఠశాల సమస్యలపై బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య ఆగ్రహం
చిన్నంబావి,అక్షిత న్యూస్:
చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు కుర్వ చిన్న మల్లయ్య ఈరోజు సందర్శించి, పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు. గత మూడు రోజులుగా స్టార్టర్, బోరు మోటార్లు కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయి, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు చదువుకునే క్లాస్‌రూమ్‌ల పక్కనే డ్రైనేజీ మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుండటంతో, విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పైపు లీకేజీ కావడంతో మరుగుదొడ్డి నీరు 8 మరుగుదొడ్డు బ్లాక్ కావడంతో తరగతి గదుల పక్కనే చేరుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో కస్తూర్బా పాఠశాలలో ఇలాంటి సమస్యలు ఉండటం బాధాకరమని బీజేపీ నాయకులు అన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి విద్యార్థినులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ సింగరాజు బీసన్న,బీజేపీ నాయకులు పల్లె మద్దిలేటి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.