సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడే… గ్రామాలు అభివృద్ధి
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల(వనపర్తి) అక్షిత:
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికార యంత్రాంగం అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వీపనగండ్ల మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 30 కల్యాణ లక్ష్మి చెక్కులను, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. వర్షపాతం గత సంవత్సరం కంటే చాలా తక్కువగా ఉండడంతో రిజర్వాయర్లు నిండకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. రైతులందరూ కూడా వర్షా ప్రభావం వల్ల రైతులు సాగు చేసే పంటలను మార్పిడి చేసుకునే విధంగా రైతులందరూ సహకరించాలని సూచించారు. ఆరుతడి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి’ షాదీముబారక్ పైరవీల కోసం ఒక్కరికి కూడా పైసలు ఇవ్వద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అనంతరం స్థానిక అధికారులతో సర్పంచులతో రివ్వు సమావేశం నిర్వహించారు. మండలంలో ఉన్న 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలను అధికారులను గ్రామ సర్పంచులను అడిగి తెలుసుకున్నారు . గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రజా ప్రతినిధులు అధికారులు యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మీసాల పార్వతమ్మ. రామన్ గౌడ్. గోపి నాయక్. స్థానిక ఉప సర్పంచ్ మధుగాని బాల పీరు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.