ఘనంగా చందానగర్ డివిజన్ లో బోనాల మహోత్సవం ..
పాల్గొన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మువ్వ సత్యనారాయణ, మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రసాద్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్, లయన్ డి ఎస్ అర్ కె ప్రసాద్ లు..
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..
తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొవ్వ సత్యనారాయణ, మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి ఎస్ అర్ కె ప్రసాద్, బోనాలు పండుగ సందర్భంగా చందానగర్ లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 బోనాలు కార్యక్రమంలో మాజి కౌన్సిలర్ రవీందర్ రావు ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొవ్వ సత్యనారాయణ డి ఎస్ అర్ కె ప్రసాద్ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.అనంతరం మొవ్వ సత్యనారాయణ కి మరియు డి ఎస్ అర్ కె ప్రసాద్ కి, రవీందర్ రావు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కట్ల శేఖర్ రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ల తోపాటుఈ కార్యక్రమంలో శ్రీ డి ఎస్ అర్ కె ప్రసాద్ టీమ్ సభ్యులు వినోద్ చౌదరి, బాలు, రాజేష్, సింహాచలం, అభి, సాయి ఈశ్వర్ తదితరులతో పాటు కాలనీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులుపాల్గొన్నారు.