కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో నూతనం గా ఏర్పాటు చేసిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించిన ఐజి చంద్రశేఖర్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో నూతనం గా ఏర్పాటు చేసిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించిన ఐజి చంద్రశేఖర్

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇంథాని గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఆసిఫాబాద్ జిల్లా ఫైరింగ్ రేంజ్ ను నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఐజి చంద్రశేఖర్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ , అదనపు కలెక్టర్,అదనపు ఎస్పి లు, ఈ నూతన ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు.

అనంతరం ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
గతంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ పరిధిలో విధులు నిర్వహించిన పొలీస్ అధికారులు ,సిబ్బంది మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ నిర్వహించేవారు. ఇది దృష్టిలో ఉంచుకొని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తో ప్రత్యెేకం చర్చించి, ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ఇంథాని గ్రామ శివారులో పోలీస్ శాఖ కు చెందిన భూమిలో కొత్తగా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కు చెందిన పోలీస్ అధికారులు , సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఇది ఎంతో ఉపయోగకరం అని తెలిపారు. ఈ ఫైరింగ్ రెంజ్ నిర్మాణంలో శ్రమించిన పొలీస్ అధికారులు, సిబ్బందికి ఐజి చంద్ర శేఖర్ రెడ్డి అభినందనలు తెలిపారు.అనంతరం ఈ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు కోసం సహాయ సహకారాలు అందించిన వారిని ఐజీ అభినందించి, సన్మానించారు.


అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…
జిల్లా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి అన్ని రకాల తుపాకుల వినియోగంపై సంవత్సరానికి రెండుసార్లు ఫైరింగ్ గురించి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఫైరింగ్ రేంజ్ లో 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు రేంజ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయీ, అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర రావు, అదనపు ఎస్పీ (ఎ.ఆర్) భీమ్ రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ , వాంకిడి సిఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ సిఐ సుధాకర్, వాంకిడి ఎస్ఐ సాగర్, జిల్లా లోని సిఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking