ఖమ్మం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మధిన వేడుకలు

ఖమ్మం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మధిన వేడుకలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు అనంతరం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడుతూ ఒక విజన్ లీడర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.ఆయన సేవలు తెలుగు ప్రజలకు అవసరమని తెలిపారు.అనంతరం వృద్ధాశ్రమంలో నగర పార్టీ కో-ఆర్డినేటర్ వడ్డెంఋవిజయ్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గుత్తా సీతయ్య రాష్ట్ర కార్యదర్శి నాగండ్ల మురళి సానబోయిన శ్రీనివాస్ గౌడ్ చలసాని ఝాన్సీ రాణి పారుపల్లి సురేష్ ప్యారిస్ వెంకన్న మందపల్లి కోటేశ్వరావు గుండ పిన్ని నాగేశ్వరావు ఎస్ కే బడే సాహెబ్ మేకల సత్యవతి తాడిశెట్టి స్వాతి తలపనేని జయరాం ఎర్నం జేమ్స్ కనపర్తి అనూష ఉన్నం శ్రీనివాస్ రంగిశెట్టి రంగమ్మ కామా అనిత సౌలం లావణ్య ఝాన్సీ ఆతుకూరి నరేష్ ఎస్వీ రమణ పొదిల భూపతి తిగుళ్ల రమణ ముమ్మడి వెంకట నరసయ్య గుడిపూడి నాగేశ్వరావు పెద్దినేని రామారావు బుడిగే శ్రీనివాస్ మేడ శ్రీనివాస్ సంపతి దివాకర్ టి భాస్కర్ బంక విజయ్ డివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking