అందత్వ నివారణకే కంటి వెలుగు వైద్య శిబిరాలు
సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్.
మద్దూరు అక్షిత న్యూస్:
తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా గురువారం జాలపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్, చేతుల మీదుగా రెండవ విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని అమే ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు.ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి,కళ్లద్దాలు,అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అందజేస్తుంది.కావున గ్రామస్థులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత మల్లేశం,ఎంపీటీసీ కల్యాణి కమలాకర్,బీఆర్ఎస్ పార్టీ మద్దూరు దూల్మిట్ట మండలాల అధ్యక్షులు మేక సంతోష్,మంద యాదగిరి,బీఆర్ఎస్ మండల నాయకులు దుబ్బుడు వేణుగోపాల్,బొల్లు చంద్రమౌళి, ఉపసర్పంచ్ రాగుల సంపత్, బీఆర్ఎస్ మండల కోశాధికారి తాటికొండ కృష్ణమూర్తి, పిసిసిఎస్ డైరెక్టర్ నారోజు శ్రీనివాస్,మాజీ డైరెక్టర్ బాలయ్య,బీఆర్ఎస్ నాయకులు,ముఖ్య కార్యకర్తలు,గ్రామ పెద్దలు,పంచాయతి కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు,డాక్టర్ రజిత,సలీం, సి హెచ్ ఓ శేషగిరి,వైద్య సిబ్బంది,ఏ ఎన్ ఎం కరుణశ్రీ, సిహెచ్ఓ,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.