దేశ బవిత చిన్నారుల విజ్ఞానం మీద ఆధారపడి ఉన్నది ఎమ్మేల్యే నరేందర్

దేశ బవిత చిన్నారుల విజ్ఞానం మీద ఆధారపడి ఉన్నది ఎమ్మేల్యే నరేందర్

వరంగల్, అక్షిత బ్యూరో :  ఎస్ఆర్ఆర్ తోటలోని వాణి విద్యానికేతన్ పాఠశాలలో ఐఐటి లో బంగారు పధకాలు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు మెడల్స్ ప్రదానోత్సవముకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎస్ఆర్ఆర్ తోట పరిసర ప్రాంతాల విద్యార్థులకు విశిష్ట సేవలు అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తోడ్పడ్డ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు,శుభాకాంక్షలు తెలిపారు
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి ఎదిగి వారి తల్లిదండ్రులకు పెరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు.
పిల్లలు చిన్నవయసు నుండే మంచి నడవడికను అలవరుచుకోవాలని సూచించారు
తదనంతరం ఎమ్మెల్యే పధకాలు సాధించిన విద్యార్థుల కు సర్టిఫికెట్స్ మెడల్స్ అందించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ రవి,ముష్కమల్ల అరుణ సుధాకర్,సోమిశెట్టి ప్రవీణ్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,డివిజన్ అధ్యక్షులు పొగాకు సందీప్,బిఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీనివాస్,బత్తిని రంజిత్,కస్తూరివంశీ,మెరుగు శ్రీధర్,కొండా రాజు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking