సామాజిక సేవా శిఖరం… స్పురధర్ రెడ్డి పేదల పాలిట పెన్నిధి…గడ్డం స్పురధర్ రెడ్డి ఆపదల్లో ఆపన్న హస్తo జాను కుటుంబానికి రూ.50 వేలు చేయూత

సామాజిక సేవా శిఖరం… స్పురధర్ రెడ్డి

పేదల పాలిట పెన్నిధి…గడ్డం స్పురధర్ రెడ్డి

ఆపదల్లో ఆపన్న హస్తo

జాను కుటుంబానికి రూ.50 వేలు చేయూత

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : సామాజిక సేవా శిఖరం… గడ్డం స్పురధర్ రెడ్డి. ఆపదల్లో ఆపన్న హస్తం. పేదల పాలిట పెన్నిధి. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పరితపించే తపస్వి. ఊరికి చేరితే చుట్టూరా ఆయా వర్గాల ప్రజలతోనే మమేకమవుతూ వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తి ఆమనగల్లుకు చెందిన సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం స్పురధర్ రెడ్డి. ప్రజాసేవలో మకుటం లేని మారాజుగా విలసిల్లుతుండ్రు. సామాజిక సేవలో చురుకైన పాత్ర పోషించి ప్రజల మన్ననలను పొందుతుండ్రు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా…. ఆపదల్లో ఉన్న అభాగ్యులకు ఆపద్బాంధవుడు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఆమనగల్లు గ్రామంలో ఎందరికో బాసటగా నిలిచి కూరగాయలు, నగదును అందజేసి అండగా నిలిచారు. మాడుగులపల్లి మండలం సీత్యాతండా గ్రామానికి చెందిన రమావత్ జాను వడదెబ్బతో మృతి చెందారు. సమాచారం అందుకున్న సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి జాను కుటుంబానికి రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. సేవల్లో మేటిగా …సేవాశిఖరంగా గడ్డం స్పురధర్ రెడ్డి…ప్రజల, ప్రజా ప్రతినిధుల, అధికారుల మన్ననలను పొందారు. అంతేకాదు ఆమనగల్లు గ్రామంలో ఇటీవల కరోనా సమయంలో మృతి చెందిన కుటుంబాలకు నగదును అందజేసి ప్రశంసలు పొందారు. ఓవైపు సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గా ఉంటూనే వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరోవైపు సామాజిక సేవలు చేసుకుంటూ ….సామాజిక బాధ్యతగా పాలు పంచుకుంటున్నాడు. పేదింటి బిడ్డలకు ఆసరాగా ఉంటూ గడ్డం స్పురధర్ రెడ్డి ప్రజా భాందవుడిగా పలువురి ప్రశంసల అందుకుండ్రు. వడదెబ్బకు గురై మృతి చెందిన రమావత్ జాన్ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిచిన స్పురధర్ రెడ్డి పలువురికి స్ఫూర్తి దాయకమని బొమ్మకల్లు సర్పంచ్ మారుతి వెంకట్ రెడ్డి, సీత్యాతండా సర్పంచ్ వంకుడోత్ సుధాకర్ నాయక్ లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking