బీజేపీ ప్రజాయాత్రకి కాలనీలలో ప్రజల బ్రహ్మరథం
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : అధికార పార్టీ పై వ్యతిరేకత చాపకింద నీరులా తయారయ్యింది శేరిలింగంపల్లిలో పాదయాత్ర చేస్తూ బీజేపి పార్టీ వైపు ప్రజల దృష్టి ని మరల్చుకుంటున్నారు యువనేత రవికుమార్ యాదవ్ చడి చప్పుడు లేకుండా పనులు చక్క బెట్టుకుంటూ వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పార్టీ శ్రేణులకీ చుక్కానిగా దిశా నిర్దేశనం చేస్తున్నారు అవినీతి ప్రభుత్వంను గద్దెదించడానికి అందరూ కలసికట్టుగా పనిచేస్తాం అన్నారు.
*పాదయాత్ర ద్వారా సమస్యలను లేవనెత్తి చూపుతే అధికారులు పనులు చేస్తున్నారు తప్పా పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మొదలుపెట్టిన పాదయాత్ర భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి,గడపగడపకు బిజెపి పార్టీని తీసుకుపోతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారపక్ష నాయకులు ప్రజల బాధలను పట్టించుకోవడంలేదని దుర్వినియోగ పాలన తప్ప ఈ బి.ఆర్. ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసినది ఏమీ లేదని ప్రభుత్వ పథకాల కూడా ప్రజలకు అందని ద్దాక్ష లాగే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ప్రజలకు అందుబాటులో లేవని డబుల్ బెడ్ రూమ్ రావూ, ఉద్యోగాలూ లేవూ బీజేపీ తీసుకు వచ్చిన ఆయుష్మాన్ భారత్, సుకన్య సమృద్ధి యోజన, పీఎం కిసాన్, ఎన్నో పథకాలను ప్రజలకు అందజేయడంలో ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ తో నే సాధ్యం అని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలియజేశారు.
బుధవారం నాడు ఆల్విన్ కాలనీ డివిజన్ హెచ్ఎంటి హిల్స్, జయనగర్ లో పర్యటించడం జరిగినది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామరాజు, కుమార్ యాదవ్, మణి భూషణ్, రవీందర్ రావు, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్,నరసింహ చారి, సీతారామరాజు, నవీన్ గౌడ్ ,ఆంజనేయులు యాదవ్, రవీందర్ రెడ్డి , కేశవులు ,గోపాల్ రావు, శ్రీహరి యాదవ్,బాలు, శ్రీధర్ పటేల్ , నరేష్ ,సందీప్ గౌడ్, శ్రీకాంత్ ,రాజు, అనిత, మునిషా, స్వప్న మొదలగు వారు పాల్గొన్నారు.