బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు. మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్.
బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు.
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్.
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
హిందూ, ముస్లింల ఐకమత్యానికి, సోదర భావానికి పవిత్ర రంజాన్ మాస ఇఫ్తార్ విందులు పుణ్య కార్యాలని బీఎస్పీ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఇతర పార్టీలకు చెందిన నాయకులు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబు, పారా సీతయ్యలతో కలిసి ముస్లిం సోదరులతో హిందూ, క్రిస్టియన్ ల మత పెద్దలతో సర్వమత ప్రార్థనలు జరిపి అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్న మతాల ఐక్యతకు భారతదేశం గొప్పతనం అన్నారు. ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య మతసామరస్యాన్ని పెంచుతాయని పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు అన్నదానం చేయడం పుణ్యకార్యమన్నారు.అనంతరం హిందూ, ముస్లిం భాయి భాయి అంటూ చేతులెత్తి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ రాపోలు భాస్కర్, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, షేక్ నయీమ్, పట్టణ ప్రముఖ వేద పండితులువిష్ణు బోట్ల హరిప్రసాద్ శర్మ, సైమన్ పాస్టర్, బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ కొండ భీమయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పిడమర్తి దశరథ, జిల్లా అధ్యక్షులు మల్లేష్, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పంది తిరపయ్య, బాగ్దాద్, నాయకులు బరిగెల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.