జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయం: ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఐపిఎస్
ఆదిలాబాద్ , అక్షిత బ్యూరో:
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల పనితీరు, ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ లో సేవలు అభినందనీయమని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ అన్నారు. బుధవారం వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో పోలీస్ ఫైరింగ్ రేంజ్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకి దగ్గరగా ఉండడం మరియు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతంలో పోలీసులు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలని అన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తుతో ఉండాలి, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను అరికట్టడంలో ముందుండాలని అన్నారు.
జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ ల పనితీరును డీఎస్పీ లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, నేరాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ , అదనపు ఎస్పీ లు అచ్చేశ్వర రావు, భీమ్ రావు, డీఎస్పీలు ,సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.