నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : పేదరిక నిర్మూలనకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుందని బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు వెల్లడించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని నిరుపేదలకు వివేకానంద నగర్ లోని తన నివాసంలో బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఎప్పుడు తమ పార్టీ అండగా ఉంటుందని పేదరిక నిర్మూలనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత అద్వానీ సూర్యారావు, శ్రీనివాస్ గౌడ్, కూకట్ పల్లి డివిజన్ ప్రెసిడెంట్ అనంత నాగరాజు, శేరిలింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ , శంకర్ రెడ్డి వినయ్ కుమార్ ,విక్కీ సాయి, తదితరులు పాల్గొన్నారు .