ఘనంగా వడ్డేవల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు….
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు బుధవారం ఎన్. కే. ఎన్. ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు బీజేపీ శ్రేణులు. పెద్ద ఎత్తున పాల్గొన పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో సత్కరించి పూలబుకే అందించి కేకులు కట్ చేయించి బానసంచ కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి భారీ బైక్ ర్యాలీగా ఎన్ కె ఎన్ ఆర్ గార్డెన్ వరకు నిర్వహించారు నియోజకవర్గ బీజేపీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో బిజెపికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు, అద్వానీ సూర్యారావు, నాయినేని సూర్య ప్రకాష్ రావు, నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, కూకట్ పల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్ నాయినేని పవన్ కుమార్ తోపాటు శేరిలింగంపల్లి బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, తూము వేణు, వినోద్ కుమార్ గౌడ్, బాలు యాదవ్ శంకర్ రెడ్డి, వినయ్ కుమార్, విక్కీ, సాయి,బీజేపీ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.