చిమ్మచీకట్లో జమ్మి చెట్టు పూజలు.. ప్రజలకు ఇబ్బందులు!
– జమ్మి చెట్టు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి
వలిగొండ, అక్షిత ప్రతినిధి:
విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం తెలంగాణ ప్రజల సంప్రదాయం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో జమ్మి చెట్టు వద్ద పూజలు చేసేందుకు సరైన లైటింగ్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిమ్మచీకట్లోనే పూజలు నిర్వహించి జమ్మి ఆకులు తీసుకోవాల్సి రావడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. పండుగ వేళ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రదేశంలో కనీసం లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత పాలకవర్గం స్పందించి జమ్మి చెట్టు వద్ద లైట్లు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
