ఖమ్మం బిసి స్టడీసర్కిల్ లో ఎస్సై/కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ మెయిన్స్ కి ఉచిత శిక్షణ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్సై మరియు పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూన్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్
జీ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 250 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు.అభ్యర్థులు ఈనెల 26 నుండి నవంబర్ 1 వరకు నేరుగా బీసీ స్టడీ సర్కిల్ ఖమ్మం కార్యాలయంకు వచ్చి అప్లై చేసుకోవాలని 2 వ తేదీ నుండి ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు కులం ఆధాయ దృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికెట్లు ప్రిలిమ్స్ హాల్ టికెట్ 4 పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో సంప్రదించాలన్నారు. గతంలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు నేరుగా వచ్చి స్టడీ సర్కిల్లో అడ్మిషన్ తీసుకోవచ్చును.ఇతర అభ్యర్థులను రిజర్వేషన్ పరంగా సెలెక్షన్ ఉంటుందని తెలిపారు.ఇతర వివరాలకు . 08742-227427, 9573859598 నెంబర్లు సంప్రదించాలన్నారు.