బుద్ధ వనంలో ఘనంగా దమ్మదీపోత్సవం
నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :
.నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో మంగళవారం నాడు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మొదటి దమ్మ దీపోత్సవాన్ని దాశరథి అవార్డు గ్రహీత ప్రముఖ కవి వేణు సంకోజు ఘనంగా ప్రారంభించారు. బుద్ధ వనం లోని అశోక ధర్మ చక్రం నుండి మహా స్తూపం వరకు ఏర్పాటుచేసిన వెయ్యి దీపాల నడుమ మహాబోధి బుద్ధ విహార కు చెందిన సంఘ పాల బౌద్ధ భిక్షువు త్రిరత్న వందనం తర్వాత అమెరికా ప్రవాస భారతీయుడు మౌద్గల్యయన మొదటి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా దమ్మ దీపోత్సవం యాత్రను మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించారు. బుద్ధ చరిత వనం లోని బుద్ధుని పాదాల వద్ద దీపాలు వెలిగించిన అనంతరం పుష్ప వందనం సమర్పించి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ సిద్ధార్ధుడు బుద్ధుడుగా మారిన తర్వాత మొదటిసారిగా కపిలవస్తు నగరానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన దీపోత్సవాన్ని దమ్మ దీపోత్సవం గా పిలుస్తారు అని దీనిని బుద్ధవనం లో మొదటిసారిగా ప్రారంభించామని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని తెలిపారు . ఈ సందర్భంగా దమ్మ దీపోత్సవ వెలుగులతో నిండిన హీలియం బెలూన్ ను ఎగరవేశారు .బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నిర్వహించిన దీపోత్సవ యాత్రలో తెలంగాణ బుద్ధిష్ట్ సొసైటీ అధ్యక్షులు పరంధాములు ,సత్తయ్య ,జానయ్య ,సాగర్ కె.వి, స్థిర చిత్త నిర్వాహకులు కేకే రాజా, తాడి సురేష్, పావులూరి సతీష్, బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి ,క్రాంతి బాబు, శ్యామ్ సుందర్ రావు, నజీష్, విద్యావంతుల వేదిక నాగయ్య, మరియు బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు.