నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
మున్సిపల్ పరిధిలోని హైవే రోడ్డు పైన రోడ్డు ఎంక్రొచ్మెంట్ సమస్యలపైన సమీక్షసమావేశం
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి :
శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఎక్కడకూడా హైవేలపైన షెడ్లు,ఏర్పాటుచేసిన రోడ్డు ఏంక్రోచ్మెంట్ సమస్యలకు కారణమై ఆ చట్టపరమైన చర్యలు తప్పవని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ,ట్రాఫిక్ పోలీసులు అన్నారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. షాపుల ముందు ఏవైనా ఎలాంటి దుకాణాలు పెట్టిన మరియు రోడ్డు మీద రంపులు స్టెప్స్ శెడ్డులు, వివిధ రకాలైనవి ఏమున్న మూడు రోజుల లోపు తొలగించుకోవాలి కమిషనర్ ట్రాఫిక్ అధికారులు వ్యాపార సముదాయాల నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలు మీరి ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తొలగించను యెడల తగిన చర్యలు మున్సిపల్, పోలీసు శాఖ చర్యలు తీసుకొని అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలి గారు, ట్రాఫిక్ సిఐ, ట్రాఫిక్ ఎస్ఐ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.