అడవి పంది అడ్డురావడంతో బైకిస్టు మృతి
నగర్ సమీపంలో ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
లోకేశ్వరం,నవంబర్ 27 అక్షిత న్యూస్ :
అడవి పంది అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్ గ్రామంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాల సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గడ్చంద గ్రామానికి చెందిన మగ్గిడి సురేష్ (41) శుక్రవారం మధ్యాహ్నం లోకేశ్వరం మండల కేంద్రంలో పనులు ముగించుకొని హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో నగర్‌లోని ఉర్దూ మాధ్యమ పాఠశాల వద్దకు రాగానే అడవి పంది ఒక్కసారిగా అడ్డుపడింది. దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో సురేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్ పేర్కొన్నారు…