ఎమ్మెస్ఎఫ్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా మారపల్లి సాయికుమార్

ఎమ్మెస్ఎఫ్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా మారపల్లి సాయికుమార్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎమ్మెస్ఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన మారపల్లి సాయికుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని స్నేహ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెస్ఎఫ్ ఇన్‌చార్జి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, సంఘాన్ని జిల్లావ్యాప్తంగా బలోపేతం చేసేందుకు సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా చెన్నూరి విష్ణు మాదిగ, అధికార ప్రతినిధిగా చిప్పకుర్తి సతీష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నితిన్ మాదిగ, ఉపాధ్యక్షులుగా మారపల్లి సాయికుమార్, కుశ్నపెల్లి ప్రశాంత్, కొల్లూరి రవి, కోశాధికారిగా శనిగారపు శశికుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా అమ్ముల ప్రశాంత్, చిప్పకుర్తి అనిల్, మంచిర్యాల టౌన్ ప్రధాన కార్యదర్శిగా అయిల్ల ప్రశాంత్, సహాయ కార్యదర్శులుగా గోగర్ల యాదగిరి, చిప్పకుర్తి మురారి, అవునూరి హేమంత్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎమ్మెస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking