పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సర్పంచ్ శ్రీలత బాలాజీ నాయక్

* ముండి చింత తండాలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి: 

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆర్థిక భరోసా కోసం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పెన్షన్ల మంజూరు పత్రాలను ఆదివారం తిరుమలగిరి మండలం ముండి చింత తండా గ్రామపంచాయతీలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ లావుడియా  శ్రీలత బాలాజీ నాయక్ గ్రామంలోని అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు దారవత్ విజయ, దారవత్ నవీన్, బాణోత్ అభిరామ్, బాణోత్ రోజా, భూక్య సజ్జన్, లావుడియా భాగ్యమ్మ, భూక్య లక్ష్మీ పార్వతి ఈ పత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత బాలాజీ నాయక్ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు గారి ఆధ్వర్యంలో, సహకారంతో ముండి చింత తండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం సభ్యులు ధరావత్ కండియా, లావుడియా వినోద యాకోబు నాయక్, భూక్యా సజ్జన్ నాయక్, బానోతు విజయ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య కిషన్, సీనియర్ నాయకులు లావుడియా రంజీ నాయక్, వెంకన్న, భూక్య హచ్య, బానోతు బురో, లావుడియా యాకుబ్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking