రాంపూర్ తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన
తుమ్మ నీపేట బ్యాంకు మేనేజర్ రామకృష్ణ
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి:
ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తీసుకోవాలని తుమ్మ నీపేట బ్యాంకు మేనేజర్ రామకృష్ణ సూచించారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో తుమ్మ నీపేట తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఖాతా తప్పనిసరిగా తీసుకోవాలని. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని. బ్యాంకులో లోన్స్ తీసుకున్న రైతులు సకాలంలో అసలు, వడ్డీ ,చెల్లించాలని. తద్వారా కొత్త లోన్స్ ఇవ్వడానికి వీలుంటుందని తెలిపారు. బ్యాంకులో లాకర్ సౌకర్యం కూడా ఉన్నది. ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకునే వారికి కూడా సదుపాయం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు సందర్శించి సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్నా రుణాలు సకాలంలో చెల్లించినట్లయితే మళ్లీ తిరిగి కొత్త రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుద్దటి కృష్ణయ్య, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ , పంచాయతీ కార్యదర్శి పాండు నాయక్,మహిళా సంఘాల బుక్ కీపర్ వెంకటయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు