తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ ఎన్నిక..
స్టేట్ జాయింట్ సెక్రటరీగా కొండపాక మండలానికి చెందిన గద్దె రాజు ఏకగ్రీవంగా ఎన్నిక
రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత..
కొండపాక, అక్షిత ప్రతినిధి:
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గద్దె రాజు (2 వార్డ్ మెంబర్) తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నాగవెల్లి జ్యోతి మహేష్ గురువారం హైదరాబాద్ రాజ్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గత కొంతకాలం నుండి సిద్దిపేట జిల్లా కు సంబంధించిన ఫోరం మండల కమిటీలు వేయడంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ తో కలిసి కమిటీలు వేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గాను అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో గ్రామ, మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలో వార్డు మెంబర్ల సమస్యలు, ఫోరం ప్రధాన డిమాండ్ల గురించి రాష్ట్ర కమిటీతో కలిసి పని చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర కమిటీలో స్థానం దక్కిందని తెలిపారు.

గద్దె రాజు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట్రస్థాయి కమిటీలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నా సేవలు ఎలాంటి పక్షపాతం లేకుండా ఫోరం డిమాండ్ల కోసం, సమస్యల కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. నాకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా, మండల,వార్డ్ మెంబెర్ సోదరులందరికీ ధన్యవాదములు తెలియజేశారు.