పాఠశాలల ఆకస్మిక తనిఖీ

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

మండల విద్యాధికారి  బషీర్ అహ్మద్

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

లింగాల మండల పరిధిలోని దారారం రాయవరం గ్రామాలలోని యుపిఎస్ మరియు ప్రాథమిక పాఠశాలలను మండల విద్యాధికారి బషీర్ అహ్మద్ పాఠశాలలను తనిఖీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా యుపిఎస్ ధారారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగింది.


పిఎస్ రాయవరం పాఠశాలను సందర్శించి పాఠశాలకు సంబంధించిన పలు రిజిస్టర్లను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశం ప్రకారం అన్ని యాజమాన్యాల పాఠశాలలో విద్యార్థులందరికీ 100% ఆధార్ నమోదు చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మిడ్లైన్ టెస్ట్ లో భాగంగా అన్ని పాఠశాలలో 100% ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking