అంబటిపల్లికి నూతన బస్సు సర్వీస్ ప్రారంభం

అంబటిపల్లికి నూతన బస్సు సర్వీస్ ప్రారంభం

 సర్పంచ్ జంబుల శ్రీవాణి హనుమంత్ రెడ్డి

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

లింగాల మండలం అంబటిపల్లి గ్రామ ప్రజల రవాణాసౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ జంబుల శ్రీవాణి హనుమంత్ రెడ్డి ,ముఖ్య అతిథిగా హాజరై నూతన బస్సు సర్వీస్ ప్రారంభించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నూతన బస్సు సర్వీస్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. బస్సు సౌకర్యం వల్ల గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలకు ఈ బస్సు సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు గ్రామ ఉపసర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యుడు ఏదుల నరసింహ గౌడ్, గ్రామ పెద్దలు దేశమోని గోవింద్, పరమేష్ రెడ్డి, గురుస్వామి జంగయ్య, ఎండి మన్సూర్, యాదయ్య, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking