విభిన్న డిజైన్లతో… చేనేత వస్త్రాలు
కూకట్ పల్లిలో పిడిఎస్ హ్యాండ్లూమ్ షోరూమ్ ను ప్రారంభించిన సినీనటి రాశి…
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో మునగాల దీప్తి చంద్రిక, పవన్ కుమార్ ఏర్పాటు చేసిన పీడీఎస్ హ్యాండ్లూమ్ నూతన షోరూంను ప్రముఖ సినీనటి రాశి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చేనేత వస్త్రాల కలెక్షన్లను ఆమె పరిశీలించారు.నటి రాశి మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, పీడీఎస్ హ్యాండ్లూమ్‌లో అందుబాటులో ఉన్న విభిన్నమైన చీరల కలెక్షన్లు ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ షోరూంను సందర్శించి తమకు నచ్చిన చీరలను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ వస్త్రాల కోసం ఈ షోరూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 120 డెన్సిటీ వరకు ఉన్న నాణ్యమైన కాటన్ వస్త్రాలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన చీరల కలెక్షన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో పెట్టుబడిగా ఇచ్చే చీరలపై ప్రత్యేక దృష్టి సారించామని, రెడీమేడ్ లెహంగాలు, బ్లౌజులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.5 వేల విలువైన చీర కొనుగోలుపై మంగళగిరి పట్టు, సెమీ కంచిపట్టు చీరలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.