ఆర్థిక భరోసాతో….ప్రతి గుండెలో ఆత్మవిశ్వాసం
చేయూత పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి:
పేదవాడి కళ్లలో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అనీ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం లింగాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పెన్షన్ మంజూరు పత్రాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోంది.ఈ పింఛన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మీ కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా. మన ప్రాంత అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎంతో కష్టపడుతున్నారు.

వారి సహకారంతో మన అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతాం.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం మీ సేవలో ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లింగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, లింగాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్, ఎంపీడీవో విజయలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు జంబుల శ్రీవాణి, అతినారపు శివకుమార్ , శ్రీశైలం, నిరంజన్, విజయ, మంగమ్మ, పార్వతమ్మ, శేఖర్, జ్ఞానేశ్వర్ రెడ్డి, మంజుల, సుమతమ్మ, తైలి విష్ణు, శంకర్, దేవి, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండలరావు, తోపాటు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.