సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం
ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి
చేర్యాల, అక్షిత ప్రతినిధి:
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చేర్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఒకరోజు ఉపాధ్యాయులుగా పాత్ర పోషించిన విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు పాత్ర కీలకంగా ఉంటుందని, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అవతారం ఎత్తి బోధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటాద్రి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, మరియు అధ్యాపకులు అజీమ్, మనోహర్, బాలు, నరసింహులు, నాగరాజు, విద్యార్థులు, పాల్గొన్నారు.