అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ….
అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్ అజెండా
మునుగోడు ఉప ఎన్నిక గెలుపుపై బీజేపీవి పగటి కలలే…
* కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం
* కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి * మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డు- బంగారి గడ్డలో స్థానిక ప్రజాప్రతినిధులతో, నాయకులతో, కార్యకర్తలతో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ అజెండా అని ఉద్ఘాటించారు. అందుకే, ఎన్నికల ప్రచారంలో ఏ ఊరికెళ్లినా గ్రామస్థులంతా టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నవారంతా మరోసారి కూడా తమ అమూల్యమైన ఓట్లను టీఆర్ఎస్ పార్టీ..కారు గుర్తుకే నమోదు చేస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి 2,639 ఓట్లు మాత్రమే వచ్చాయని, అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. మునుగోడులోనూ ఇదే పునరావృతం చేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లంతా టీఆర్ఎస్ కే మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లంతా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టయితే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని భాస్కర్ రావు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీడు భూములన్నీ సశ్యశ్యామలమయ్యాయని అన్నారు. మారుమూల తండాలను, గూడెంలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. గొల్ల కురుమలకు, యాదవులకు గొర్రె పిల్లలను పంపిణీ చేసి టీఆర్ఎస్ సర్కారు ఆర్ధికంగా బలోపేతం చేసిందన్నారు. రాష్ట్రంలో 3,66,976 యూనిట్ల గొర్రెల పంపిణీ ద్వారా రూ.5,490 కోట్లు సంపద సృష్టించిందన్నారు. ఆసరా పెన్షన్ల కింద ప్రతీ ఏడాది ప్రభుత్వం రూ.11,724 కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం రూ.2016, వికలాంగులకు రూ.3016 పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ వయసును 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు సీఎం కేసీఆర్ తగ్గించారని అన్నారు. త్వరలో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. లబ్ధిదారులే టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు అని చెప్పారు. మారుమూల గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల పెట్టుబడులకు స్వర్గదామంగా మారిందని తద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకే అన్నంపెట్టే అన్నపూర్ణ గా విరాజిల్లుతున్నదని అన్నారు. మూడేండ్లలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని అన్నారు.ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్ అని అన్నారు. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ బీడు భూముల్లోనూ గోదావరి జలాలు పారుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వీలవుతుందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా సాగుకు స్వర్ణయుగం కొనసాగుతున్నదని అన్నారు. రైతు వేదికల నిర్మాణం ద్వారా రైతుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా సీఎం కేసీఆర్ రూ.1,00,116 అందజేస్తున్నారని అన్నారు. గురుకులాలను స్థాపించి నాణ్యమైన విద్యతో పాటు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారని అన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తోందని అన్నారు. గిరిజనుల ఉద్ధరణ కోసం ప్రత్యేక నిధితో రూ.34,815.14 కోట్లను కేటాయించి ఏడేండ్లలో సీఎం కేసీఆర్ రూ.50,581.78 కోట్లు కేటాయించిందని అన్నారు. ప్రతీ కార్యకర్త మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బాబా షరీఫ్, వార్డు అధ్యక్షులు అబ్దుల్లా, కోల సైదులు, షేక్ ఫయాజుద్దీన్, నాగులు, జానపాటి శ్రీనివాస్, మాతంగి రవి, నాంపల్లి ఏసు, శైలేందర్, దొరేపల్లి వెంకన్న, విక్రమ్, ఆంజనేయులు, కిరణ్, సత్తు సైదులు, నాయకులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.