యాంటీ నో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉమ మహేశ్వరంలో నల్లమల రన్నర్స్
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
యాంటీ నో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉమ మహేశ్వరంలో నల్లమల రన్నర్స్ ఆధ్వర్యంలో 5 కె రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని నల్లమల రన్నర్స్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఆరోగ్యం కోసం నడక లేదా పరుగు అలవాటు చేసుకోవాలని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి… ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమంలో సలేశ్వరం, మల్లేష్, అశోక్, సీను, నరేష్, మల్లేష్, సురేష్,తేజ,ప్రసాద్ ,శ్రీకాంత్,కృష్ణ పాల్గొన్నారు