ప్రజా సమస్యలు పట్టించుకుంటే ప్రధాన రహదారి పరిస్థితి ఇదేనా
గత 15 రోజులుగా హనుమకొండ చౌరస్తా లో ప్రధాన రహదారి దుస్థితి
వరంగల్, అక్షిత బ్యూరో:
హనుమకొండ చౌరస్తా రాగన్న దర్వాజా ప్రధాన రహదారిపై గత 15 రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్ల మీదికి చేరి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండ ప్రధాన రహదారి వేయి స్తంభాల గుడి కానుకొని రాగన్న దర్వాజా ఎదురుగా గత 15 రోజులుగా డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి చేరి తీవ్ర అసౌకర్యాన్ని గురిచేస్తుంది. ప్రయాణికులకు దుర్గంధంతోపాటు బురద నీరు బట్టల పై పడి దుర్గంధం వెదజల్లుతోంది. బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు వెళ్లడం వల్ల పక్కన వెళుతున్న వారికి ఆ నీరు చిల్లి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే దారి వెంట అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సైతం వెళుతుంటారు దాని ఈ విషయం పట్టించుకోకపోవడంపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ముప్పు తప్పింది ఇంత ఎండల్లో కూడా డ్రైనేజీ నీరు రోడ్ల మీదికి చేరి భారీ వర్షాన్ని తలపిస్తున్నాయి ఇంత జరుగుతున్న గత 15 రోజులుగా వాహనదారులు రోడ్లపై వెళుతున్న పాదాచారులు దుకాణదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని పాలకులు ఇప్పటికైనా వర్షాకాలం తన ప్రతాపం చూపకముందే డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు. వివిధ రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి పరిస్థితి ఈ రకంగా ఉంటే మారుమూల ప్రాంతాల్లో జనాభాషాలు ఎక్కువ తిరగని పల్లెల్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో ఊహించుకోవచ్చు ప్రజా పాలన ప్రజలకు సేవలు చేసేదిగా సమస్యలు గుర్తించి పరిష్కారం చేసే విధంగా ఉండే దానిని ప్రజాపాలన అంటారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అధికారులు కూడా ఈ రోడ్లపైనే పయనిస్తుంటారు. కానీ ఈ సమస్య ప్రజల సమస్యగా గుర్తించకపోవడమే ప్రశ్నార్ధకమయింది. ఏది ఏమైనా రహదారులు పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రజలకు అంకితం చేయబోతున్న కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన పై సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రధాన రహదారి బాగు చేయాలని నగర ప్రజానీకం కోరుతున్నారు.