డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ

– ప్రతి యువత భారత రాజ్యాంగాన్ని చదవాలి 

– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

 మెదక్ అక్షిత బ్యూరో :

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.పిల్లుట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహం సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయానికి చిహ్నం, ప్రతి పేద కుటుంబానికి ఆశాజ్యోతి, ప్రతి యువకుడికి స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు. అంబేడ్కర్ జీవితం మనందరికీ ఆదర్శమన్నారు.చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. ఆయన మనకు చెప్పిన గొప్ప సందేశం ఒక్కటే… పుట్టుక మన చేతిలో ఉండదు… కానీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతిలోనే ఉంటుందన్నారు.బాబాసాహెబ్ డా. బి ఆర్ అంబేడ్కర్ బహుభాషావేత్త, ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం, న్యాయశాస్త్రం, చరిత్ర అన్నింటిలో నిష్ణాతుడు. అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేశారు. అంబేడ్కర్ తన కోసం జీవించలేదు. సమాజం కోసం జీవించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారు. సమాన హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించారు. గౌరవంగా జీవించడం ప్రతి మనిషి హక్కు అని ఆయన మనకు నేర్పించారు. మన దేశానికి బీ.ఆర్ అంబేడ్కర్ అందించిన అత్యంత గొప్ప కానుక భారత రాజ్యాంగం. రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవప్రదమైన జీవితం అందించిందన్నారు.అందుకే ఆయనను భారత ప్రజాస్వామ్య శిల్పి గా పిలుస్తామన్నారు. బాబాసాహెబ్ చెప్పిన మార్గంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, మానవ గౌరవం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం. మన యువత బాబాసాహెబ్ జీవితాన్ని చదవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. విద్యను ఆయుధంగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ బుర్ర మురళీ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇంచార్జి రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking