ఎ న్యూ మ రేషన్ పా రాలు తప్పులు లేకుండా పూర్తి చేయాలి

ఎ న్యూ మ రేషన్ పా రాలు తప్పులు లేకుండా పూర్తి చేయాలి

-భద్రాచల సబ్ కలెక్ట ర్ మృనాల్ శ్రేష్ఠ…

 భద్రాచలం అక్షిత న్యూస్

భారత ఎన్నికల సంఘం ఓటర్ల పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారములు అందించేటప్పుడు ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ తప్పులు లేకుండా ఎ న్యూ మరేషన్ ఫారాలు పూర్తి చేచి ఓటర్లకు అందజేయాలని భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత బి ఎల్ ఓ సూపర్వైజర్లకు సూచించారు.ఆదివారం భద్రాచలం మండల కేంద్రంలో, 145 మెడికల్ కాలనీ, 168 వెంకటేశ్వర కాలనీ, 143 గొల్ల బజార్ 173 ఏఎస్ఆర్ కాలనీ లోని పోలింగ్ స్టేషన్ పరిధిలో సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్వైజర్లు, బిఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు,ఓటర్ నమోదు ఏవిధంగా చేస్తున్నది ఆయన పరిశీలించి బి ఎల్ వో లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి బిఎల్వో, సూపర్వైజర్లు ఎన్యుమరేషన్ ప్రక్రియ చాలా పగడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. వర్షాకాలం నడుస్తున్నందున ఓటర్ల దగ్గర ఎనిమరేషన్ ఫారాలు నమోదు చేసి తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు వహించాలని, ఫారాలు తడవకుండా జాగ్రత్తగా భద్రపరచాలని అన్నారు.ఎన్యుమరేషన్లు ఫారాలు పూరించేటప్పుడు తప్పులు లేకుండా చూడాలని అన్నారు. సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలో బిఎల్వోలు, సూపర్వైజర్లు ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలలో పూరించేటప్పుడు ఓటరు పూర్తి వివరాలు తప్పులు లేకుండా పూర్తిచేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking