తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఖమ్మం / అక్షిత బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ భక్త రామదాసు కళాక్షేత్రం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఖమ్మం పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ జానీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రియాల్టర్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకపోతుల నరసయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయిన మేము తెలంగాణ గవర్నమెంట్ కి చేస్తున్న వ్యాపారంలో 7% టాక్స్ రూపంలో మరల గవర్నమెంట్ కి మేము డబ్బులు కడుతున్నామని అన్నారు.తెలంగాణ గవర్నమెంట్ మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

సిఎస్ సోమేశ్ కుమార్ ని కలిసి అనేక సందర్భాల్లో జిపి లే ఔట్ వెంచర్స్ కి తక్షణమే రిజిస్ట్రేషన్ కల్పించాలని డిమాండ్ చేశాం.తెలంగాణ రాష్ట్రంలో ఏది జరగాలనా ఏది కావాలన్న ఖమ్మం జిల్లా నుండే మొదటి అడుగు పడాలి అని కొనియాడారు.ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఖమ్మం జిల్లా కమిటీ చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని అన్నారు.రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్నే చట్టపరమైన విధానం తీసుకొచ్చే రూపంగా మేము తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ పోరాడుతామని అన్నారు. జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ప్రత్యేకంగా ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు బిల్లా సతీష్ బాబు అధ్యక్షతన 50 మంది మహిళా కళాకారులచేత భారీ ర్యాలీగా తరలించినందుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రియల్టర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు
అన్నం వీర ప్రసాద్ రావు(శ్రీ వాలి ఎస్టేట్స్ )జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటేపల్లి జనార్దన్ రావు జిల్లా రియల్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలూరు రాము వెంచర్స్ అసోసియేషన్ మెంబర్ గరికపాటి ఆంజనేయ ప్రసాద్ క్రెడాయి జిల్లా కమిటీ అధ్యక్షులు బండి జయ కిషోర్ సీనియర్ రియల్టర్ కోటేశ్వర రావు మహిళా కమిటీ మంద ఉషారాణి బరిగెల లలిత చలమల సుజాత నున్నా కృష్ణప్రియ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking