టిఆర్ఎస్ పార్టీలో గందరగోళం…. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య విభేదాలు.. దళిత ఎంపీపీని కాబట్టే నన్ను అవమానించారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎంపీపీ శ్రీవిద్య

టిఆర్ఎస్ పార్టీలో గందరగోళం….

ప్రజాప్రతినిధులు, నేతల మధ్య విభేదాలు..

దళిత ఎంపీపీని కాబట్టే నన్ను అవమానించారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎంపీపీ శ్రీవిద్య

ఎంపీపీ మండలాధ్యక్షుడు మధ్య రగులుతున్న ఆతిపద్య పోరు

అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీవిద్య

 అక్షిత న్యూస్ మాడుగులపల్లి: మరోసారి అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి మండలాధ్యక్షుడు ఎంపీపీ మధ్య ఆతిపద్య పోరు తారాస్థాయికి చేరింది వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మాడుగుల పెళ్లి మండలం లో కుక్కడం నుండి పాములపాడుకు 19 కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరు కాగా శంకుస్థాపన గాను అధికారులు ప్రజాప్రతినిధులను అధికార పార్టీ నేతలను పిలిచి శంకుస్థాపన చేయవలసి ఉంది కానీ ఎంపీపీ పోకల శ్రీవిద్యను శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్ అండ్ బి అధికారులు పిలిచి ఆమె రాకముందుకే సమయం అయిపోతుందని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఆ సమయానికి అక్కడికి చేరుకున్న ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు నేను ఒక దళిత జాతికి చెందిన మహిళను కాబట్టే నన్ను పిలిచి అవమానించారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఎవరో ఒక నాయకులు చెప్పాడని ప్రోటోకాల్ కూడా పాటించకుండా అవమానపరచడం సరికాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఓ అధికార పార్టీ నేత ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నాడు తను చెప్పిందే వేదం అనే చందంగా మండలాన్ని నడిపిస్తూ ఎంపీపీని కనీసం లెక్క కూడా చేయకుండా ప్రతి కార్యక్రమంలో తానే ముందుండి నిర్వహిస్తూ ఉండడం మండల ప్రజా ప్రతినిధులు పిలవకుండా తానే మండలాన్ని శాసించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న జడ్పీ కో ఆప్షన్ సభ్యులు జోక్యం చేసుకొని ఎంపీపీ పోకల శ్రీవిద్య బుజ్జగిచ్చి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని నచ్చజెప్పడంతో రోడ్డుపై బైఠాయించినటువంటి ఎంపీపీ తన నిరసన విరమించారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను మరోసారి బయటకు రావడం చర్చనీయాంశమైంది. మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం అందరిని సమయనం పాటిస్తూ మండలాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తాల్సిన నాయకులే ఇలా గొడవ పడటం మండల ప్రజలను మరియు పార్టీలో నాయకులకు చేదుగా మిగిలింది

Leave A Reply

Your email address will not be published.

Breaking