ఆశల స్వామికి ఘన నివాళి
ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి
నాంపల్లి, అక్షిత న్యూస్: అంశాల స్వామి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు గత 32 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రకస్ కి బలైన అంశాల స్వామి అనేక పోరాటాలు చేసి నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలో అంశాల స్వామి కీలక భూమికి పోషించాడు అంశాల స్వామి కొద్దిసేపటి క్రితం అకాల మరణం యావత్ నల్గొండ జిల్లా ప్రజలను ద్విగ్భ్రాంతికి గురిచేసింది

ఆయన మరణం నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి గురైన బాధితులకు తీరని లోటు ఢిల్లీ నాయకుల్ని గల్లి వరకు రప్పించి విషపు నీళ్ల గోడును వెల్లబుచ్చిన మంచి మనసున్న నాయకుడు చిన్నతనువైన పెద్ద మనసుతో ఆలోచనతో మహా నాయకుల్ని ఆకర్షించిన ఉద్యమ నాయకుడు అంశాల స్వామి అని అన్నారుమరణంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి తెలియజేశారు.