దేశ రాజకీయాల్లో పెను సంచలనం..  కాంగ్రెస్ లో  టీఎంసీ విలీనం!

దేశ రాజకీయాల్లో పెను సంచలనం.. 

కాంగ్రెస్ లో  టీఎంసీ విలీనం!

అక్షిత వెబ్ డెస్క్ 

ఇండియన్ పాలిటిక్స్లో సంచలనప రిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన ‘ఇండియా’ (INDIA) కూటమి ఢిల్లీ సమావేశం ముగిసిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ అనూహ్యమైన మార్పు చోటుచేసుకోబోతుందనే వార్తలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్లో లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అనంతరం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఇప్పటికే దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సొంత ఉనికి ప్రమాదంలో పడటంతో పార్టీని, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి మమతకు కాంగ్రెస్లో విలీనం కావడం మినహా మమతకు మరో మార్గం కనిపించడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు

సోనియా నివాసంలో సుదీర్ఘ భేటీ..

అయితే, కాంగ్రెస్లో టీఎంసీ విలీన ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. మమతా బెనర్జీ మంగళవారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) నివాసంలో ఆమెతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అదేవిధంగా ఇవాళ మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సైతం రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో ప్రత్యేకంగా సమావేశమవ్వడం టీఎంసీ విలీన వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఒకవేళ విలీనం జరిగితే పార్టీతో పాటు అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుకు కూడా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు.

నాడు కాంగ్రెస్ నుంచి వీడి..

 

కాగా, 1997లో మమతా బెనర్జీ కాంగ్రెస్ ను వీడి 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ సొంత గూటికి చేరేందుకు సిద్ధమవ్వడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ విలీనాన్ని టీఎంసీ తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. తాము కాంగ్రెస్లో విలీనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బెంగాల్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking