మారని అధికారుల తీరు!

మారని అధికారుల తీరు!

పేదల స్కీమ్  పెద్దోళ్లకూ.. 

కరీంనగర్ అక్షిత బ్యూరో :

ప్రభుత్వలు మారినా, మారని అధికారుల తీరుపై కరీంనగర్  మున్సిపల్  పరిధిలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేదలకు చివరి మజిలీ సేవలు అందించేందుకు ప్రవేశ పెట్టిన ఒక్క రూపాయి అంత్యక్రియల పథకం కొందరు అధికారుల తీరుతో అభాసుపా లవుతోంది. పేదలు అడిగితే సవాలక్ష కొర్రీలు పెడుతున్న మున్సిపల్ అధికారులు పెద్దోళ్లకు మాత్రం ఎలాంటి నిబంధనలు విధించకుండానే సేవలందిస్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ డివిజన్లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. ఒక్క రూపాయి పథకం కింద అంత్యక్రియలు నిర్వహిం చాలని స్థానికులు వేడుకున్నా అధికారులు కనిక రించలేదు. తాజాగా.. మున్సిపల్లో ఓ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి కుటుంబ సభ్యులు చనిపోతే ఎవరు సిఫారసు చేయకపోయినా, ఒక్క రూపాయి పథకానికి అర్హులు కాకపోయినా మున్సిపల్ వైకుంఠ రథంలో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించడం వివా దాస్పదంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking