ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రజాసేవకుడు రాధాకృష్ణ ఆకలి మరణం
– అంతిమ యాత్రలో పాడె మోసిన మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్
తాండూరు, అక్షిత ప్రతినిధి:
తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రముఖ ప్రజా సేవకుడు రాధాకృష్ణ ఇటీవల అనా రోగ్యంతో గురువారం మృతి చెందారు. వారి అంతిమ యాత్రలో వార్డ్ నెం. 7 మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ పాల్గొని, పాడె మోసి దివంగ తునికి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ.. ఆయన మరణం సమాజా నికి తీరని లోటని, పేర్కొన్నారు. దివంగత రాధాకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, అల్లాహ్/భగ వంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులు ధైర్యాన్ని ప్రసా దించాలని, కోరారు. అలాగే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సాను భూతిని తెలిపారు. ఈ అంతిమ యాత్రలో కాలనీ పెద్దలు, అభి మానులు, పాల్గొని తుది వీడ్కోలు పలికారు.