పదోన్నతి పొందిన సత్తయ్యకు పోలీసుల ఘన సత్కారం
మందమర్రి, అక్షిత ప్రతినిధి
రామకృష్ణాపూర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహించిన ఆదిమూలం సత్తయ్య ఎస్సైగా పదోన్నతి పొంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ పర్శ రమేష్, మందమర్రి ఎస్సై నరేష్, రామకృష్ణాపూర్ ఎస్సై జాడి శ్రీధర్‌తో పాటు పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అధికారులు మాట్లాడుతూ, ఆదిమూలం సత్తయ్య విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీతో సేవలందించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తూ మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. స్పందించిన సత్తయ్య సహచర అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎక్కడ పనిచేసినా అదే అంకితభావంతో ప్రజాసేవ కొనసాగిస్తానని తెలిపారు.