ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి…
లోకేశ్వరం మండల కేంద్రంలో బీజేపీ నిరసన…
లోకేశ్వరం, జూలై 24 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నీట్ పరీక్షల అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు లోకేశ్వరం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం,నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిపరం చేయాలనే కుట్రతో కాంగ్రెస్, ఆప్, ఎస్పీ తదితర పార్టీలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చర్యలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.ఇదే సమయంలో హిందుత్వాన్ని, ఆరాధ్య దైవం భగవాన్ శ్రీరాముడిని, జాతి మాత అయిన భారతమాతను అవమానించేలా కొందరు నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న అలాంటి వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొడికే సాయన్న,అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి ఒడ్నాల మురళి,సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మెండె శ్రీధర్,ధర్మోర సర్పంచ్ సంజీవ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సంతోష్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, చైతన్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయితేజ గౌడ్, యువ నాయకులు భూమేష్, నవీన్ రెడ్డి, మండల సోషల్ మీడియా కన్వీనర్ బొడికే ప్రవీణ్,మామిడి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…