ప్రజాక్షేత్రంలో తనపై గెలిచి చూపించాలి

ప్రజాక్షేత్రంలో తనపై గెలిచి చూపించాలి

కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనుల్లో అడ్డు వస్తున్నాను అనడం హాస్యాస్పదం

చిలక వాగును కబ్జా చేశానని అనడం దుర్మార్గపు చర్య

తాండూర్, అక్షిత ప్రతినిధి:

చిలుక వాగును కబ్జా చేశానని, కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, 13వ వార్డు మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ వరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం వార్డు పరిసరాల్లో ఉన్న చిలుక వాగు కబ్జా అంశాలపై వారు మాట్లాడుతూ.. గతంలో కౌన్సిల్ గా ఉన్నప్పుడు తాను జెసిబి పెట్టి చిలక వాగును ప్రక్షాళన చేశా నరన్నారు. కాంగ్రెస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. చిలక వాగును కబ్జా చేశానని అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్నారు. ప్రజలకు అనునిత్యం అందు బాటులో ఉండి చిలుక వాగును ప్రక్షాళన చేసిన విషయాన్ని తన వార్డులో ఎవరిని అడిగినా చెబు తారన్నారు. తాను వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన సమయంలో ఇక్కడ చిలక వాగు ఎక్కడ కాలువ లాగా కూడా కనిపించ లేదన్నారు. వార్డు ప్రజల సౌకర్యార్థం తాను మూడుసార్లు చిలుక వాగును జెసిబిల ద్వారా తవ్వించి, ఒక రూపును కల్పించడం జరిగిందన్నారు. ఒక్కసారి మాత్రమే తనకు ఎమ్మెల్యే ఫండ్ ద్వారా నిధులు అందాయన్నారు. ఒక సీసీ రోడ్డు వేస్తే 50 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండా లన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాను వేసిన సీసీ రోడ్డును, స్థానిక కౌన్సిలర్ వేసిన సీసీ రోడ్డును గమనిస్తే తేడా స్పష్టంగా కనిపి స్తుందన్నారు. ఇప్పుడు స్థానిక కౌన్సిలర్ వేసిన సీసీ రోడ్డు 100 సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్డును తల పిస్తుందన్నారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు తాను సొంత డబ్బులను పెట్టుకొని సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా కష్ట పడ్డానన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన దొంగలే కాంగ్రెస్ పార్టీని ఆజమా యిషి చేస్తున్నా రనన్నారు. మీరు చేసిన అభివృద్ధిని కార్యక్రమాలు ఏమిటో ముందుకు వచ్చి చూపించా లన్నారు. జనరల్ వార్డులో ఇప్పటికైనా ఎక్కడి నుండైనా తాను పోటీకి సిద్ధమన్నారు. తనపై గెలిచి చూపించా లన్నారు. ప్రజా క్షేత్రంలో తనపై గెలిచి చూపించా లన్నారు. ఇక్కడ ఉన్న చిలక వాగు ప్రాంతాన్ని కబ్జా చేసింది ఎవరన్నారు. గాయత్రి కబ్జా చేసిందా, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డ సమాధానం చెప్పాలని వండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking