బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్.

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్.

బియ్యం, నగదు సహాయం అందజేత 

ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట పట్టణానికి చెందిన మారోజు నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత షేక్‌ చాంద్ బుధవారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం తన వంతు సహాయంగా అర క్వింటాల్ బియ్యంతో పాటు రూ.2,500 నగదు అందజేశారు. కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అనారోగ్యంతో ఉన్న నరేష్ తల్లిదండ్రులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.అదేవిధంగా సామాజిక సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలవడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో కందుల మణి, బోళ్ల సైదులు, నామ నంది నరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking