మానవ హక్కులను హరించొద్దు

మానవ హక్కులను
హరించొద్దు

హక్కుల పరిరక్షణే లక్ష్యం

జీవిత పవిత్రత…
ప్రతి మానవుని హక్కు

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

లివింగ్ హోప్ ప్రతినిధి
ఎలీషా మాతంగి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మానవ హక్కులను హరించొద్దని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ సుధా బాలకృష్ణ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, సామాజిక వేత్త డా.రాజు, కస్తూరి ప్రభాకర్, లివింగ్ హోప్ ప్రతినిధి ఎలీషా మాతంగి, నజరేత్ ప్రార్థన మందిరం సంఘ కాపరి కిరణ్ కుమార్ సౌపాటి, సీనియర్ జర్నలిస్ట్ మర్రి ఎలియాస్ లు అన్నారు. శనివారం స్థానిక వైష్ణవి గ్రాండ్ లో ప్రపంచ మానవ హక్కుల ఫోరం (హెచ్ డబ్ల్యూపిఎల్ )
సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న సంఘాలకు చేయుత నందించాలన్నారు. జీవిత పవిత్రత…ప్రతి మానవుని హక్కుగా ప్రపంచమంతా పరిగణించాలన్నారు.

జీవిత పవిత్రత.. ప్రతి మానవుని ప్రాథమిక హక్కులైన మానవ హక్కుల పట్ల భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, అవగాహన పెరుగుతున్న తరుణంలో, మిర్యాలగూడ కేంద్రంగా పనిచేస్తున్న ‘లివింగ్ హోప్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫోరమ్ కు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే ” బత్తుల లక్ష్మారెడ్డి” తో పాటు, నల్గొండ, మిర్యాలగూడ నుండి వచ్చిన ప్రతినిధులు, భారతదేశ, దక్షిణ కొరియా రెండింటిలోనూ జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఈ ఖండనలో ఏకమయ్యారు. హెచ్ డబ్ల్యూపిఎల్ చైర్మన్ మన్ హిలిని విడుదల చేయాలని కోరుతూ ఒక వినతి పత్రంపై సంతకం చేసి తమ ఉమ్మడి మద్దతును తెలియజేశారు. లివింగ్ హోప్ ప్రతినిధి ఎలీషా మాతంగి మాట్లాడుతూ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరిగినట్లు ఆరోపించబడిన మానవ హక్కుల ఉల్లంఘన కేసును ప్రవేశపెట్టి,ఈ విషయంపై మరింత శ్రద్ధ వహించి, పరిష్కారం కనుగొనాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం చైర్మన్ మెన్ హిలీకి 95 ఏళ్లు. ఆయనపై జరుగుతున్న నిర్బంధ విచారణకు ఒక మితిమీరిన చర్యగా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శాంతి దూతగా, ఆయన పారిపోతారని గాని, సాక్షాలను నాశనం చేస్తారని గాని ఎటువంటి ఆందోళనలు లేవు. అంతేకాకుండా,ఈ చర్య కొరియా యుద్ధ వీరుడుగా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ఆయన చేసిన సేవలను, మరియు ప్రపంచ శాంతికి, ప్రపంచానికి ఆయన చేసిన సేవలను విస్మరిస్తోందని ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నూకల వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ఖాజా హమీద్, ఎండి అస్లాo, నాగయ్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking