సింగరేణి లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలి
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే అన్ని విభాగాలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్, అకౌంట్స్, సివిల్ విభాగాల అధికారులతో ఆయన ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరుగుతున్న పనులు, సాధించిన పురోగతిపై జీఎం సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సింగరేణి ప్రగతిలో ప్రతి విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, అధికారులు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మందమర్రి ఏరియాను అగ్రగామిగా నిలపాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో ఏజీఎం ఎఫ్ అండ్ ఏ ఆర్వీఎస్ ఆర్కే ప్రసాద్, డీజీఎం పర్సనల్ సీహెచ్ అశోక్, డీజీఎం ఐఈడీ కిరణ్ కుమార్, సివిల్ ఎస్‌ఈ శ్రీధర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణతో పాటు అన్ని గనుల సంక్షేమ అధికారులు, సివిల్ అధికారులు, అకౌంట్స్ అధికారులు పాల్గొన్నారు.