ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినశుభాకాంక్షలు  

ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినశుభాకాంక్షలు  

– మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ అక్షిత బ్యూరో

ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.త్యాగం, సేవాభావం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని, మైనారిటీ సోదరుల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ బక్రీద్ పర్వదినం రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking