కొత్త కమిటీకి ఎమ్మెల్యే అభినందన

టీయూడబ్ల్యూజే – ఐజేయూ వేములపల్లి మండల నూతన కమిటీకి ఘన సన్మానం

వేములపల్లి, అక్షిత న్యూస్ :

టీయూడబ్ల్యూజే – ఐజేయూ వేములపల్లి మండల నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ మౌలాలి, ఉపాధ్యక్షులుగా వంగాల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తండు వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముండ్ల కళ్యాణ్ యాదవ్, సహాయకార్యదర్శిగా ముండ్ల లింగయ్య యాదవ్ తదితర కమిటీ సభ్యులను టివిటి ఫౌండేషన్ -అమనగల్లు ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-బిఎల్ఆర్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, తాళ్ల వెంకటేశ్వర్లు, మాలి కాంతారెడ్డి తదితరులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, పాత్రికేయుల హక్కుల పరిరక్షణకు, జర్నలిస్టుల సంక్షేమాకిట్నిtకి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking