ఉద్యమం సమయం లో చెప్పిన ప్రతీ మాట ను కేసీఆర్ నిజం చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికి పుట్టిందే..బీఆర్ఎస్ కేసీఆర్ కు అండగా ఉండి అయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి
ఉద్యమం సమయం లో చెప్పిన ప్రతీ మాట ను కేసీఆర్ నిజం చేశారు.
తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికి పుట్టిందే..బీఆర్ఎస్
కేసీఆర్ కు అండగా ఉండి అయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి
సూర్యాపేట,అక్షిత ప్రతినిధి: ఉద్యమం సమయం లో చెప్పిన ప్రతీ మాట ను ఎనిమిదేళ్ళ పాలన లో కేసీఆర్ నిజం చేశారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయం కళ్యాణ లక్ష్మిట్, షాదీ ముభారాక్ చెక్ ల పంపిణీ కన్నుల పండుగ గా జరిగింది. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారుల 4కోట్ల 24 లక్షల చెక్ లను మంది పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే కేసీఆర్ నాయకత్వం లో ని టీ.ఆర్.ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని అన్నారు.

కేసీఆర్ కు అండగా ఉండి అయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు సూర్యాపేట నియోజక వర్గం లో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు 85 కోట్లు అన్నారు. సూర్యాపేట నియోజక వర్గం లో జరిగిన అభివృద్ధి పనుల విలువ 7000 కోట్ల రూపాయలు దాటిందన్న మంత్రి,జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి కోసం 300 కోట్ల రూపాయలు అని అన్నారు.2014 కు ముందు తో పిలిస్తే ప్రస్తుతం గ్రామాలలో కరెంట్, త్రాగు,సాగు నీరు, ఎలా వస్తుందో చూస్తున్నారన్న మంత్రి, గతంలో కరెంట్ కోసం, సాగు నీటి కోసం ధర్నాలు, చేసి కేసులు పాలైన పరిస్థితులు ఉంటే ప్రస్తుత పరిస్థితులు మొత్తం రివర్స్ అయ్యాయని అన్నారు..

తాను గ్రామాలకు వెళ్ళినప్పుడు చెరువు లు పోస్తున్న అలుగు నీటి తో పొలాలు జాలు పడుతున్నయని తమకు జాలు కాలువలు కావాలని ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తెలంగాణ సరిహద్దు లో ఉన్న కర్ణాటక , మహారాష్ట్ర తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా తనను తెలంగాణ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయం లో ఒకప్పుడు శాపనార్థాలు పెట్టినఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సైతం దేశం లో అందరికంటే ఎక్కువగా కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమం లో మంత్రి తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిపి, జడ్పీటిసి, ఎంపిటిసి, సర్పంచ్, మండల అధ్యక్షులు,గ్రామ శాఖ అధ్యక్షులు, తదితర నేతలు పాల్గొన్నారు.