క్యాన్సర్ విద్యార్థికి తోటి విద్యార్థుల ఆర్థిక సహాయం…
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : క్యాన్సర్ తో బాధపడుతున్న విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి తమ అభిమానాన్ని ప్రేమను చాటి చెప్పారు తనతో కలిసి చదువుతున్న తోటి విద్యార్థులు. క్యాన్సర్ కు మందు లేదు కానీ ఆర్థికంగా ఉన్నవారికి కొన్ని రోజులు చికిత్స ద్వారా బతికించే అవకాశం ఉంటుందని దీనికి మెరుగైన చికిత్స చేయడం కోసం ఆ క్యాన్సర్ పేషెంట్ కు ఆర్థిక సహాయం అవసరం ఎంతైనా ఉంటుంది. కూకట్ పల్లీ డివిజన్ దీ నబంధు కాలనీకి చెందిన గ్లోబల్ మోడల్ హైస్కూల్లో యూకేజీ చదువుతున్న ఆశ్రీత్ అనే ఐదు సంవత్సరాలు విద్యార్థి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్లోబల్ మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ సిహెచ్ వెంకటస్వామి ప్రిన్సిపల్ నాగరాజులు ఆ విద్యార్థికి ఆర్థిక సాయం చేయాలని విద్యార్థులకు సూచించారు. దీంతో విద్యార్థులు తమ తోటి విద్యార్థి మరికొన్ని రోజులు బతకాలని ఆశతో తమ వంతు సహా యంగా తల ఇంత అంటూ ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తోటి విద్యార్థుల ప్రేమాభిమానాలు తోడై ఆశ్రిత్ కు మరింత ఆయుష్షును ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుందాం వీలైతే మనం కూడా తమ వంతు సాయం చేద్దామని ముందుకు రావడం హర్షనీయంగా చెప్పవచ్చు.