ఓ లింగా. ఓ లింగా నామస్మరణ తో మారుమ్రోగుతున్న పెద్ద గట్టు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జగదీశ్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ ప్రతీ ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలి

పెద్దగట్టు జాతర దృశ్య మాలిక

 

ఓ లింగా. ఓ లింగా నామస్మరణ తో మారుమ్రోగుతున్న పెద్ద గట్టు

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జగదీశ్ రెడ్డి

స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్

ప్రతీ ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలి

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:

లింగ ఓ..లింగా .. నామస్మరణం .. భేరీల మోతలు… గజ్జల చప్పుళ్ళు , సంప్రదాయ నృత్యాలతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగిపోతున్నాయిపెద్దగ ట్టు(గోళ్లగట్టు) లింగమంతుల స్వామి జాతర కు భక్తులు పోటెత్తారు. మహిళల శివాలతో, కాళ్ల గజ్జెలు, బేరీల చప్పుళ్లతో, కత్తులు, త్రిశూలాల విన్యాసాలతో యాదవులు రెండవ రోజు సోమవారం లింగమంతుల స్వామి మొక్కులు తీర్చుకునేందుక పెద్దగట్టు కు భారీగా చేరుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి బోనం చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే బోనంతో స్వామివార మొక్కులు తీర్చుకుంటున్నారు. లింగమంతుల స్వామి , చౌడమ్మ తల్లిని దర్శించుకునేదుకు భక్తులు పెద్దగట్టు పై బారులు తీరారు.


పెద్దగట్టు పై కొలువై ఉన్న లింగమంతుల స్వామిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద గట్టు జాతర కు లక్షలాది గా తరలి వచ్చిన భక్తుల లో కనిపిస్తున్న కోలాహలం, సంతోషమే రాష్ట్ర అభివృద్ది కి నిదర్శనం అని మంత్రి అన్నారు. రాష్టం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి యజ్ఞం తో ఎడారి లా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు. కాళేశ్వరం మొదటి ప్రతిఫలం అందుకున్న ప్రాంతం సూర్యాపేట నే అన్న మంత్రి గోదావరి జలాలతో లింగమంతుల స్వామి పాదాలను తడిపామన్నారు..
కాళేశ్వరం జలాలతో లింగమంతుల స్వామి పాదాలు కడిగే భాగ్యం కేసీఆర్ కె దక్కిందని తెలిపారు.
స్వామి వారి ఆశీస్సుల తో దేశం లోనే సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. కాలం కలిసొచ్చి పాడి పంటలు బాగా పండాలని లింగమంతుల స్వామిని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. ప్రతీ ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలన్న మంత్రి


స్వామి వారి ఆశీస్సుల తో మళ్ళీ జాతర నాటికి తెలంగాణా మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
…………..
నిరంతరం అధికారుల పర్యవేక్షణ
……………..
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో అధికారులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైద్య సిబ్బంది, మున్సిపల్,పోలీస్ శాఖ అధికారులు నిరంతరంగా విధులు నిర్వహిస్తుండగా జాతర వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ వద్దకు తప్పిపోయూన వారి చెంతకు చేరుస్తుంన్సరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking