జాతీయ పత్రిక ‘అక్షిత న్యూస్’ ఎఫెక్ట్:
బైంసా ఎలక్ట్రికల్ కార్యాలయ బోర్డుపై జిల్లా పేరు మార్పు
వార్తతో అప్రమత్తమైన అధికారులు – “ఆదిలాబాద్” స్థానంలో “నిర్మల్” పేరుతో కొత్త బోర్డు ఏర్పాటు
నిర్మల్, ఏప్రిల్ 30 (అక్షిత బ్యూరో):
జాతీయ పత్రిక అక్షిత తెలుగు న్యూస్ డైలీలో ప్రచురితమైన కథనం ప్రభావంతో బైంసా సబ్ ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పాత బోర్డును అధికారులు సవరించారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం బైంసా ప్రాంతం నిర్మల్ జిల్లాలోకి చేరినప్పటికీ, కార్యాలయ బోర్డుపై “ఆదిలాబాద్ జిల్లా” పేరుతోనే కొనసాగుతున్న విషయం ఇటీవల జాతీయ పత్రిక అక్షిత న్యూస్ “జిల్లా మారినా బోర్డు మాత్రం పాతదే… బైంసా సబ్ ఎలక్ట్రికల్ కార్యాలయంలో నిర్లక్ష్యం బహిర్గతం” అనే శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ వార్త పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. కార్యాలయ బోర్డును సరిదిద్దుతూ, “నిర్మల్ జిల్లా” పేరుతో కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. మీడియా కథనంతో స్పందించిన అధికారుల చర్యలను స్థానికులు స్వాగతిస్తూ, సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జాతీయ పత్రిక పాత్రను అభినందించారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యాలు పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షణను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
